ఏకంగా 9మందితో.. నాగబాబు రొమాంటిక్ నే !
మెగా బ్రదర్ నవ్వుల బాబుయే కాదు.. రొమాంటిక్ బాబు కూడా. ఆయన ఏకంగా 9మంది అమ్మాయిలని లవ్ చేశాడట. వారందరికీ ప్రొపోజ్ చేశాడట. ఇంతకీ వాళ్లెమేన్నారు ? అంటే ఛీ కొట్టారు. అంతే నాగబాబుకు ఘోర అవమానం జరిగినట్టే. కానీ, వాటిని తుడిచేసుకొని.. మరో అమ్మాయి వెంటపడటం బాబుకి మహాసరదాగా ఫీలయ్యేవాడట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబునే చెప్పుకొచ్చాడు. ఆయన జబర్థస్త్ షోకి గుడ్ బై చెప్పేసి.. జీ టీవీలో కొత్తగా మొదలైన లోకల్ గ్యాంగ్ షోలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.
ఈ షోకి ప్రదీప్ యాంకర్ గా చేస్తున్నారు. ప్రదీప్ మీ లవ్ స్టోరీ చెప్పండి సార్… అడిగితే.. “అబ్బో.. అప్పట్లో ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలు వెంట పడేవాడిని… తొమ్మిది మంది ప్రపోస్ చేశాను. కానీ అంతా ఛీ కొట్టారు’ అంటూ తన ప్రేమకథలని చెప్పుకొచ్చాడు నాగబాబు. ప్రస్తుతం టీవీషోస్ తో పాటు సినిమాల్లోను నటిస్తూ బిజీగా ఉన్నారు నాగబాబు. ఆయన తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నిలదొక్కుకొని స్టార్ గా ఎదిగే క్రమంలో ఉన్నారు.