ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో మరో పిటిషన్ !
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఓటుకు నోటు’ కేసు మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చేసింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.2017లోనే ఆళ్ల రామకృష్టారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేసినప్పటికీ… సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ లిస్ట్ కాలేదు. దీంతో, ఆయన మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు.
2015 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు వెలుగులోనికి వచ్చింది. నేటి కాంగ్రెస్ ఎంపీ, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ కేసులో జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షంగా నిలిచిన వీడియో టేపులో ఫోన్ లో మాట్లాడింది చంద్రబాబే అనే ఆరోపణలున్నాయి.