షాలినీ పాండే ‘నిశ్శబ్ధం’ లుక్ 

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ధం’. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు.  కోన వెంకట్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అనుష్క, మాధవన్ లుక్స్ వచ్చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి షాలినీ పాండ్ లుక్ ని విడుదల చేశారు.

భయం, బాధ, ఆందోళనతో కూడిన లుక్ లో షాలినీ పాండే కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ‘సోనాలి’ అనే పాత్రలో కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో మైఖేల్ మాడ్సన్ .. అంజలి, అవసరాల, సుబ్బరాజు కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో మాధవన్ సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు.