ప్రేమికుల రోజున రాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.వల్లభ నిర్మిస్తున్నారు. ఓ షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
“ఇదో వైవిధ్యభరితప్రేమకథ. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేమికుణ్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. అందుకు ప్రేమికుల రోజుకి మించిన సందర్భం లేదు. విజయ్ సినీ జీవితంలోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది” అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది. పూరి సినిమా తర్వాత మజిలీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది.