అదాకు చట్నీవాడు కావాలట ! 


డ్యాన్స్‌, యాక్షన్‌ రెండింటిలోనూ ఆరితేరిన కథానాయిక అదా శర్మ. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘కమాండో 3’. యాక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో విద్యుత్‌ జమ్వాల్‌ కథానాయకుడిగా నటించారు. ఆదిత్యా దత్‌ దర్శకత్వం వహించారు. ఈ వారమే (నవంబరు 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అదా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ‘మీరు ఓ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి?’ అని ప్రశ్నించగా..  కొత్తగా ఈ వ్యాపారవేత్త ఎవరు? నేను సింగిల్‌గా ఉన్నాను. నాకు సరిపోయే జీవిత భాగస్వామిని వెతికి పెట్టమని నా ఫ్యాన్స్‌ను కూడా ఇటీవల అడిగాను. అతడు దోస, చట్నీ పర్‌ఫెక్ట్‌గా చేయాలి. జంతువులంటే ఇష్టం ఉండాలి. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండాలని చెప్పుకొచ్చింది. మరీ.. అదాకి ఆ చట్నీవాడు ఎప్పుడు దొరుకుతాడో చూడాలి.