అనసూయకు వంశీ ఆఫర్


దర్శకుడు కృష్ణవంశీ నుంచి సినిమా వస్తుందంటే.. ఓ ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ఆయన కాస్త గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. మరాఠీ చిత్రానికి రిమేక్ ఇది. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. బ్రహ్మానందం మంచి పాత్ర దక్కిందని చెబుతున్నారు. ఈ సారి బ్రహ్మీ నవ్వించడం కాదు. ఓడిపిస్తాడని.. ఆయన మాత్ర భాగోద్వేగంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హాట్ యాంకర్ అనసూయని తీసుకొన్నట్టు టాక్.

‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది అనసూయ. ఆ తర్వాత క్షణం, రంగస్థలం సినిమాలతో ఆకట్టుకొంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ పర్వాలేదనిపించింది. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకొంటున్న అనసూయకు రంగమార్తాండలో కృష్ణవంశీ ఓ మంచి పాత్రని ఇచ్చాడట. సోమవారం ప్రారంభం అయిన ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక అనసూయ పాత్రపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.