సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా
అనూహ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. ఊహించని విధంగా రాజీనామా చేశారు. రేపటిలోగా బల నిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వచ్చిన కొద్దిసేపటికే ఎన్సీపీ నేత అజిత్ పవార్ యూ-టర్న్ తీసుకొన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అజిత్ పవార్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలు మహాయతి (బిజెపి-శివసేన కూటమి)కే పట్టం కట్టారు. బిజెపి ప్రభుత్వానికి ప్రజామోదం ఉంది. తమ పార్టీ ఏకంగా 150 స్థానాల్లో గెలుపొందింది. శివసేన కంటే బిజెపికే ఎక్కువ స్థానాలు లభించాయి. కానీ, బలాబలాలు చూశాకా శివసేన బేరాలకు దిగింది. శివసేనకు సిఎం పోస్టు ఇస్తామని ఎన్నికలకు ముందు ఎక్కడా వాగ్దానం చేయలేదు. పొత్తు కుదిరాకా శివసేన మోసం చేసిందని ఆరోపించారు.