ఆర్టీసీ జేఏసీ నాయకులు.. ఇప్పుడేమంటారు?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు రెండ్నెళ్లుగా సాగింది. చివరకి ఏలాంటి డిమాండ్స్ నెరవేరకుండానే సమ్మెని విమరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమ్మె కాలంలో చాలామంది ఆర్టీసీ కార్మికుల గుండెలు ఆగాయి. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీరు వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.

సమ్మెకు పిలుపునిచ్చింది యూనియన్ నాయకులే. కాబట్టి ఆర్టీసీ కార్మికుల మరణాలకు వాళ్లే బాధ్యత వహించాలని హైకోర్టు పేర్కొంది. ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది. ప్రభుత్వం కారణంగానే కార్మికులు చనిపోయారనడానికి ఆధారాలేంటని కోర్టు ప్రశ్నించింది. కార్మికులను డిస్మిస్ చేసినట్లు ప్రభుత్వమేమీ ప్రకటించలేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు వ్యాఖ్యలతో కార్మికుల మరణాలని ఆర్టీసీ జేఏసీ నేతలే కారణమని తేలినట్టయింది.