ధోనీ రీ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్
వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది ? అసలు ఉంటుందా .. ఉండదా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే, వచ్చే ఏడాది మార్చిలో ధోని తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోఅడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్చి 18, 21వ తేదీల్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు నిర్వహించనుంది. ఆసియా XI, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, భారత్ నుంచి 7గురు టాప్ క్రికెటర్లను అనుమతించాలని బీసీబీ.. బీసీసీఐని కోరింది. ఆ ఏడుగురిలో ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా ఉన్నారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అనీ కుదిరితే.. ఈ రెండు మ్యాచ్ లలోనూ ధోని ఆడొచ్చు.