‘మహా’ ట్విస్టులు.. ప్రకాష్ రాజ్ డ్యాన్సులే డ్యాన్సులు !


మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు నటుడు ప్రకాష్ రాజ్ కి మహాదానందాన్ని కలిగించినట్టున్నాయి. తనకి పడిని భాజాపాపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఎపిసోడ్ కనిపిస్తుందేమో’ అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. ఓ అధినేత, మరో చాణక్యుడు, వారి పెంపుడు చిలుకలతో కూడిన అర్థరాత్రి అంతరాత్మల మూకుమ్మడి రాజకీయం ఎలా ఉంటుందో రేపు అందరూ చూడాల్సిందేనంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 

ఆ తర్వాత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేసిన నేపథ్యంలో మరోసారి ప్రకాష్ రాజ్ స్పందించారు. “సిగ్గు సిగ్గు… డ్యాన్స్ చేయలేని డ్యాన్సర్లు ఎట్టకేలకు వైదొలిగారు” అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి తలవంపులు తెస్తున్నారంటూ మండిపడ్డారు. మొత్తానికి.. బల నిరూపణకి ముందే ఫడ్నవీస్ చేతులెత్తేయడం ప్రకాష్ రాజ్ కి ఆనందం కలిగించిందని అర్థమవుతోంది.