చైతూ-సామ్ మరోసారి జంటగా ?

పెళ్లి తర్వాత నాగ చైతన్య-సమంత జంటగా నటించిన ‘మజిలీ’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత మరోసారి చై-సామ్ ఎప్పుడు  కలిసి నటిస్తారా ? అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక త్వరలోనే తీరనుందని సమాచారమ్. ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ పాత్రలో నాగార్జున కనిపించగా, మరో ముఖ్యపాత్రలో నాగచైతన్య నటించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో చై పాత్రతోపాటు ఆయన భార్య పాత్ర కూడా కీలకమేనట. అందుకే ఆ పాత్రకు సమంతను ఎంపిక చేసే ఆలోచనలో దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ ఉన్నాడట.

ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వీరిద్దరు కలిసి నటించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బంగార్రాజుకి సమంత ఓకే చెబితే.. ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరగొచ్చు. ఇదీగాక.. ఈ సినిమా మరో మనం కూడా కావొచ్చు. బంగార్రాజులో అఖిల్ కూడా కనిపిస్తారనే టాక్ ఉంది. అమలని ఏ చిన్ని పాత్రలో ఇరికిచ్చినా.. అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మనం వచ్చినట్టుంది.