ఈ నెల 28న తెలంగాణ కేబినేట్ భేటీ !
ఈ నెల 28న తెలంగాణ కేబినేట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నెల 29న కూడా మంత్రివర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆర్టీసీ అంశాన్ని హైకోర్టు కార్మిక న్యాయస్థానానికి బదిలీ చేసినందువల్ల సదరు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరోవైపు, సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరేందుకు బస్ డిపోలకి క్యూ కడుతున్నారు. ఐతే, వారిని ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి చేర్చుకోవడం లేదు. ఈ సందర్భంగా బస్ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆందోళనకి దిగడానికి ప్రయత్నించిన కార్మికులని అరెస్ట్ చేస్తున్నారు.