‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ టీజర్ చూశారా ?

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’. బ్రూస్‌లీ స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. బుధవారం బ్రూస్‌ లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మీడియాతో ముచ్చటించారు. స్టార్‌ హీరోలతో సినిమా ఎందుకు తియ్యరు ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వర్మ సమధానమిస్తూ..  ‘నేను చేసే సినిమాలకు ఇమేజ్‌ ఉన్న హీరోలు సెట్‌ కారు. ఎందుకంటే నేను వాస్తవిక చిత్రాలు తీస్తాను.’ అని అన్నారు.

ఇక ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ టీజర్ విషయానికొస్తే.. యాక్షన్ అదిరింది. అదే సమయంలో వర్మ పైత్యం కూడా టీజర్ లో కనిపించింది. యాక్షన్ పేరుతో రొమాంటిక్ ప్రేక్షకులని నిరాశపరచలేదు. ఓ ఘాటు లిప్ లాక్ సీన్ ని ఉంచాడు. ఆ టీజర్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !