విజయ్ దేవరకొండ కొత్తింటి ఖర్చు ఎంతో తెలుసా ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ నగర్ లో ఓ కొత్తింటిని కొనేశాడు. హీరో శ్రీకాంత్ ఇంటి సమీపంలోనే విజయ్ ఇల్లు. చాలా విశాలంగా ఉంటుంది. కట్టిన ఇంటినే కొనుకొన్నాడా ? లేదంటే తన అభిరుచి ప్రకారం నిర్మాణం చేయించాడా ? అనే విషయం తెలీదు. కానీ, ఈ ఇల్లు కోసం భారీగా ఖర్చు చేశాడట. ఏకంగా రూ. 20కోట్లు అయినట్టు సమాచారమ్.

ఇన్నాళ్లు విజయ్ దేవరకొండ కుటుంబం శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండేది. ఆదివారం తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ కొత్తింటికి మారాడు. ప్రస్తుతం విజయ్ నాలుగు చేతుల్లా సంపాదిస్తున్నాడు. హీరోగా భారీ పారితోషికం తీసుకొంటున్నాడు.రౌడీ బ్రాండ్ తో దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నిర్మాతగా మారాడు. ఇవీగాక, పలు బ్రాండ్లకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రూ.20కోట్లతో కొత్తింటిని కొనేశాడు విజయ్.  

సొంతిల్లు కొనేసిన తర్వాత ఇంకేముంటుంది ? పెళ్లి. అప్పుడే ఇంట్లో విజయ్ కోసం పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారమ్. తగిన అమ్మాయి దొరికితే వచ్చే యేడాదియే విజయ్ ని ఓ ఇంటివాడిని చేయనున్నారు. అలాగని.. విజయ్ పెళ్లి మేటర్ ని బయటికి పొక్కకుండా చాలా సైలైంట్ గా వేట మెదలెట్టినట్టు సమాచారమ్. ప్రస్తుతం విజయ్ వరల్డ్ ఫేమస్ లవ్వర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. వచ్చే యేడాది జనవరిలో ఈ సినిమా మొదలుకానుంది.