దిశా పటానీ కొత్త ఫోటోలు.. కేక !


లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది దిశా పటానీ. ఆ సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో ఆమెకి మరో అవకాశం రాలేదు. కానీ, ధోని బయోపిక్ తో మరోసారి పటానీ తెలుగు ప్రేక్షకులని మరోసారి పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. సినిమాల కన్నా లవ్ ఎఫైర్ తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దిశాపటానీ-టైగర్ ష్రాఫ్ ల డేటింగ్ గురించి తెలిసిందే. 

టైగర్‌ ష్రాఫ్‌ – దిశా పటానీ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు డైరెక్టర్ గా చెప్పకున్నా.. ఇన్ డైరెక్టర్ గా సంకేతాలిచ్చారు. ‘ఇద్దరికీ సిగ్గే. అందుకే ఏ విషయం అన్నది చెప్పలేకపోతున్నాం’ అని దిశా ఓసారి మీడియాతో అన్నారు. ఆ తర్వాత వీరిద్దరు బ్రేకప్ చెప్పుకొన్నారనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై దిశా, టైగర్ ఎవ్వరు ఇప్పటి వరకు స్పందించలేదు.

కాకపోతే.. మునుపటిలా పార్టీలు, పబ్ లలో కలిసి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య దిశా నుంచి కొత్త పోజులు, ఫోటోలు బయటికిరావడం లేదు. తాజాగా దిశా పటానీ కొత్త ఫోటోలు రెండు బయటికొచ్చాయి. ఇందులో దిశా హాట్ గా కనిపిస్తుంది. అన్నట్టు..దిశా పటానీ తన పేరిట యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ని ఫేమస్ చేసే పనిలో పడింది. ఈ ఫోటోలని కూడా ఆమె ఛానెల్ కోసం వాడుకుంటుందేమో!