పవన్ కు ‘పింక్’ నచ్చలేదా.. ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి కోరిక తీరుస్తూ పవన్ రీఎంట్రీ పై ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. ‘పింక్’ రిమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ షాక్ ఇవ్వబోతున్నట్టు టాక్.

‘పింక్’ సినిమాపై పవన్ అంత ఆసక్తిగా లేడని సమాచారమ్. పింక్ కథ పవన్ కి నచ్చింది. ఐతే, అంతకంటే ముందు.. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారమ్. సన్నిహితుల దగ్గర పవన్ ఈ విషయం చెప్పారట. 
ప్రభుత్వంపై పోరాటం చేసే ఓ ప్రతిపక్షనేత చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేందుకు సాగించిన పోరాటాన్ని హైలెట్ చేస్తూ సినిమా తీయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నాడట. ఈ నేపథ్యంలో పింక్ రిమేక్ లో పవన్ నటిస్తారా ? అనే సందిగ్థత ఏర్పడింది. త్వరలోనే దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.