‘రాములో రాముల’ సరికొత్త రికార్డు ! 

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ సామజవరగమన, రాములో రాముల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ‘సామజవరగమన’ అత్యధిక వ్యూస్, లైక్స్ సొంతం చేసుకొన్న పాటగా సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఇప్పుడు అల.. మాస్ సాంగ్ ‘రాములో రాముల’ 72మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది. 7లక్షల లైక్స్ ని తెచ్చుకొంది. అత్యధిక వ్యూస్ తెచ్చుకొన్న రెండో పాటగా రికార్డ్ సృష్టించింది. సామజవరగమన తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకొన్న పాటగా రాముల రాములో రికార్డుకెక్కింది. త్రివిక్రమ్-బన్నీ కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న అల.. ప్రేక్షకుల ముందుకు రానుంది.