బీజేపీని నమ్ముకున్న కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో, కేంద్రంలో సరైన బలం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సమస్యపై ఏమీ చేయలేని పరిస్తితి. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించినా, ఆరోపణలు చేసినా.. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పులేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

తెలంగాణ ఆర్టీసీని పరిరక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధానిని కోరారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు గత రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నాయని, వారి సమస్యలను పరిష్కరించాలని లేఖలో కోరారు. మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కష్టాలని కేంద్ర మంత్రుల దగ్గర చెప్పానని తెలంగాణ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపిన సంగతి తెలిసిందే.

ఇవేవి పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటు పరం చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారమ్. ఈ మేరకు తాజాగా జరుగుతున్న కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 50యేళ్లకి పైబడిన ఆర్టీసీ కార్మికులని బలవంతపు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.