షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య
ఎన్ని చట్టాలు చేసిన మహిళలపై దారుణాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోని షాద్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది.చటాన్ పల్లి వంతెన వద్ద ప్రియాంకరెడ్డి (22) అనే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నర్సయిపల్లి. ప్రస్తుతం వీళ్లు శంషాబాద్ లో నివాసముంటున్నారు. ప్రియాంక నవాబ్ పేట మండలం కొల్లూరులో వెటర్నరీ వైద్యురాలిగా పని చేస్తున్నారు.
కొద్దిరోజులుగా ప్రియాంకరెడ్డి ముఖం మీద మొటిమలు (పింపుల్స్)కు ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. బుధవారం సాయంత్రం ట్రీట్‌మెంట్ కోసం మాదాపూర్‌లోని ఓ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రియాంక.. వచ్చే దారిలో స్కూటీ పాడైందని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ సమయంలో లారీ డ్రైవర్లు ఉన్నారని ప్రియాంక కుటుంబసభ్యులకు తెలిపినట్లు సమాచారం. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఉదయం అయ్యే సరికి ఆమె శవమై కనిపించింది.