వర్మకు అమితాబ్ విషెస్

బిగ్ బీ అమితాబ్-రామ్ గోపాల్ వర్మ కలయికలో అరడజనుకుపైగా సినిమాలోచ్చాయ్. వీరి కాంబో వచ్చిన ‘సర్కార్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరి కాంబోలో సర్కార్ రాజ్, సర్కార్ 3, నిశ్శబ్ద్, ఆగ్, డిపార్ట్మెంట్ తదితర సినిమాలొచ్చాయ్. అంతేకాదు.. ఈ వివాదాస్పద దర్శకుడు బిగ్ బీకి సన్నిహితుడు కూడా. ఈ నేపథ్యంలోనే భారత్‌లో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న తొలి మార్షల్ ఆర్ట్ సినిమా  ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’పై అమితాబ్ స్పందించారు. వర్మకి విషెస్ చెప్పారు. 

బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా’ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టీజర్ ని విడుదల చేశారు వర్మ. ఈ టీజర్ కి మంచి స్పందన వస్తోంది. ఈ టీజ‌ర్ ని చూసిన మెగాస్టార్ అమితాబ్ వర్మపై ప్రశంసలు కురిపించారు. టీజ‌ర్ లింక్ షేర్ చేస్తూ.. ‘నా గుడ్ విషెస్ నీకు ఎప్ప‌టికి ఉంటాయి’ అని కామెంట్ పెట్టారు బిగ్ బీ. అమితాబ్ స్పందనతో ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’కు బాలీవుడ్ లో మరింత ప్రచారం దొరికినట్టుంది. వివాదాలతో సహవాసం చేసే వర్మని బిగ్ బీ అభినందించడం కూడా ఆకట్టుకుంటోంది.