‘అర్జున్ సురవరం’ ట్విట్టర్ రివ్యూ

యంగ్ హీరో నిఖిల్ సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. అందుకే ప్రేక్షకులు ఆయన సినిమాపై నమ్మకంగా ఉంటారు. కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలని ఆశపడుతుంటారు. ఐతే, ‘ఎక్కడికిపోతావు చిన్నివాడా’ తర్వాత నిఖిల్ నుంచి ఆ రేంజ్ సినిమా రాలేదు. అయినా.. ఆయన తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’పై ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన అర్జున్ సురవరం ప్రేక్షకుల నమ్మకాన్నినిలబెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టీఎన్ సంతోష్ దర్శకత్వంలో అర్జున్ సురవరం తెరకెక్కింది. నిఖిల్ కి జంతగా లావణ్య త్రిపాఠి నటించింది. కొద్దిసేపటి క్రితమే ‘అర్జున్ సురవరం’ ఉదయం పూట ఆట మొదలైంది. అంతకంటే ముందే యుఎస్ లో ప్రీమియర్ షోస్ పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకుల ట్విట్టర్ వేదికగా సినిమా టాక్ ని పంచుకొంటున్నారు. సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 

డీప్ వెళ్లి పాజిటివ్స్, నెగటివ్స్ చెప్పడం లేదు. కానీ, సినిమా బాగుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాక్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా సినిమాని గ్రిప్పింగ్ నడిపాడు దర్శకుడు. సన్నివేశాలని సహజంగా తెరకెక్కించాడు. నిఖిల్ నటన బాగుంది. 

నిఖిల్-లావణ్య జంటగా తెరపై బాగా కనిపించిందని చెబుతున్నారు. మొత్తానికి.. అర్జున్ సురవరంపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పోటీలో మరో సినిమా లేకపోవడం కూడా అర్జున్ సురవరం కు కలిసొచ్చేలా ఉంది. ఈరోజు రావాల్సిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సెన్సార్ సమస్యల వలన వాయిదాపడిన సంగతి తెలిసిందే.