హీరో రాజశేఖర్’కు షాక్.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ !

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు  షాక్ ఇవ్వబోతున్నారు. వరుసగా యాక్సిడెంట్స్,ట్రాఫిక్ రూల్స్’ని అతిక్రమిస్తున్న రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేసే దిశగా పోలీసులు చర్యలు ప్రారంభించినట్టు సమాచారమ్. రాజ‌శేఖ‌ర్ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్ప‌టికే ఆర్టీఏకి లేఖ కూడా రాశార‌ట‌. దీంతో మ‌రి కొద్ది రోజుల‌లోనే ఆయ‌న లైసెన్స్ ర‌ద్దు కానుంది తెలుస్తోంది.

2017 అక్టోబ‌ర్ 9న రాజశేఖర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని రాజశేఖర్ కారు ఢీకొట్టింది. ఆ సమయంలో ఆయన ఆల్కహాలు తీసుకొని ఉన్నారనే వార్తలొచ్చాయ్. ఐతే, త‌ల్లి చనిపోయింద‌నే డిప్రెష‌న్‌లో నిద్ర‌మాత్ర‌లు వేసుకోవ‌డం వ‌ల‌న ఆ మ‌త్తులో కారు యాక్సిడెంట్ చేశాడని ఆ తర్వాత విచారణలో తేలింది.

ఇటీవల శంషాబాద్ పెద్ద గోల్కొండ వ‌ద్ద ఓఆర్ఆర్‌పై రాజ‌శేఖ‌ర్ కారు యాక్షిండెంట్ అయిన సంగతి తెలిసిందే. కారు మూడు ప‌ల్టీలు కొట్టింది. స‌మ‌యానికి బెలూన్స్ తెరుచుకోవ‌డంతో ఆయ‌న‌ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ సమయంలో కారులో మందుబాటిల్ ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలనే నిర్ణయానికి ట్రాఫిక్ పోలీసులు వచ్చారని తెలుస్తోంది.