కిర్రాక్ డ్యాన్స్ తో ఛార్మిని పడేసిన పోరగాడు !

పూరి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ని మురిపించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకొంది. ఇక యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని డైలాగ్స్‌, సాంగ్స్ ప్ర‌తి ఒక్క‌టి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌కి రామ్ వేసిన స్టెప్పులు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ పాట లేకుండా ఏ వేడుక జ‌ర‌గ‌డం లేదంటే అతి శ‌యోక్తి కాదు. గల్లీ గల్లీలో ఇస్మార్ట్ శంకర్ పాటలు మారుమ్రోగిపోతున్నాయ్.

తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలోని ‘చిల‌కా.. చిల‌కా’ అనే సాంగ్‌కి ఓ కుర్రాడు ఎంతో ఎన‌ర్జిటిక్‌గా డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయింది. ఈ వీడియోపై ఛార్మి కూడా స్పందించింది. ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఛార్మి..  ‘నీలో ఎంతో ఎన‌ర్జీ ఉంది. అద్భుతంగా డ్యాన్స్ చేశావు. ఒక‌వేళ నేను అక్క‌డి ఉండి ఉంటే నీతో క‌లిసి డ్యాన్స్ చేసే దాన్ని’ అంటూ కామెంట్ పెట్టింది. అందాల ఛార్మినే పడేయడం అంటే మాములు విషయమా.. !

ప్రస్తుతం పూరితో కలిసి ఛార్మి విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తారని, మదర్ సెంటిమెంట్ తో సినిమా ఉండనుందని చెప్పుకొంటున్నారు. వచ్చే యేడాది జనవరి నుంచి ఫైటర్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూరి పాత్రలో విజయ్ ఎలా ఇమిడిపోతాడని చూడాలని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.