పవన్ వ్యక్తిత్వంపై వర్మ షాకింగ్ కామెంట్స్
వివాదాలతో సహవాసం చేయడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి అలవాటే. ఆయన సినిమాలపై కేసులు, నిరసనలు సహజమే. వర్మ తాజా సినిమా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ విషయంలోనూ వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. కోర్టు అభ్యంతరాలతో ఈ సినిమా టైటిల్ ని ‘అమ్మరాజ్యంలో కడపరెడ్లు’గా మార్చిన సంగతి తెలిసిందే. సెన్సార్ చిక్కుల కారణంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఐతే, రిలీజ్ పై ఎలాంటి టెన్షన్ లేని వర్మ సినిమా ప్రమోషన్స్ ని కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలని పోలుస్తూ వర్మ వ్యాఖ్యలు చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమే అతని పై వస్తున్న విమర్శలకు కారణమని వర్మ అన్నాడు. ఆయన వ్యక్తిత్వమే ట్రోల్ చేసే విధంగా ఉంటుందని, అతడి వ్యవహార శైలి ట్రోలింగ్‌కి ఎక్కువగా అవకాశం కల్పిస్తుందని చెప్పుకొచ్చాడు. అదే మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేసే అవకాశమే ఉండదు. ఆయన వ్యక్తిత్వం గొప్పదని వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మెగా అభిమానుల మధ్య చిచ్చుపెట్టేందుకు వర్మ ప్లాన్ చేసినట్టు ఉన్నాడని ఏకిపారేస్తున్నారు. ‘అమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రని కూడా చూపించబోతున్నాడు పవన్. ఐతే, ఇందులో పవన్ ని పొలిటికల్ కామెడియన్ గా చూపిస్తారా.. ? లేదంటే పవర్ ఫుల్ గా చూపించబోతున్నారా ? అన్నది చూడాలి. సినిమా ప్రమోషన్స్ లో మాత్రం పవన్ ని పెద్దగా వాడలేదు వర్మ. డైరెక్ట్ గా సినిమాలోనే పవన్ పాత్రని చూసే విధంగా సస్పెన్స్ ని మెయిటైన్ చేశారు.