‘రూలర్’ కథ ఇదేనా.. !

బాలయ్య గర్జిస్తే.. మాస్ కు పండగే. ఆయన మరోసారి గర్జించేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న చిత్రం ‘రూలర్’. సోనాల్‌చౌహాన్‌, వేదిక కథానాయికలు. ప్రకాష్‌రాజ్‌, జయసుధ, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి చిరంతన్‌భట్‌ సంగీతం అందించారు. హ్యాపీమూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 20న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమా కథపై చిత్రబృందం హిట్ ఇచ్చింది.

‘ఈ సినిమాలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో కనిపిస్తారు. ఒక లక్ష్యం కోసం రూలర్‌ చేసిన పోరాటమేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. బాలకృష్ణ పాత్ర చిత్రణ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. రూలర్‌ శాసనమేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’నని చిత్రబృందం చెబుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ లుక్స్‌, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. డిసెంబర్ 15న రూలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.