వైసీపీ నేతలు దేవుడిని వదలడం లేదుగా.. !
ఆంధ్రప్రదేష్ ని మొత్తం వైసీపీ జెండా రంగులతో నింపేశాల ఉన్నారు. ఏపీలోని బడులు, గుడులు, విగ్రహాలు, ఆఖరికి స్మశానవాటికలకి కూడా వైసీపీ జెండా రంగులని పూస్తున్నారు. అంతేకాదు.. దేవుడిని కూడా వదలడం లేదు. తాజాగా సాయిబాబాని వైసీపీ జెండా రంగులతో కప్పడం హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో.. బాబా విగ్రహానికి వైసీపీ శాలువా కప్పడం.. ఆ సందర్భంగా తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతోంది.
బాబాకు 8 రోజుల క్రితం ఓ భక్తురాలు ఈ శాలువాను సమర్పించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. అయితే.. వైసీపీ పార్టీ రంగులకు ఈ శాలువాకి రంగుల్లో తేడా ఉందని.. కానీ.. అభ్యంతరాలు రావడంతో.. వెంటనే ఈ శాలువాని తొలగించినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే గేదె కొమ్ములకు కూడా వైసీపీ జెండా రంగులు కనిపించాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, వైసీపీ నేతలు రంగులు మార్చడం తప్ప ఏమీ చేయడం లేదని తెదేపా నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అవేవీ పట్టించుకోకుండా సీఎం జగన్ తనదైన మార్క్ పాలనతో ఆకట్టుకొంటున్నారు.