నిధి అదిరిపోయే పోజు !

నిండైన అందాలు హీరోయిన్ నిధి అగర్వాల్ సొంతం. వాస్తవానికి వాటితోనే నెట్టుకొస్తుంది. ఈ ముద్దుగుమ్మ పాత్రలకి సరిగ్గా సరిపోయినా.. ఫేస్ లో ఒక్కటే ఎక్స్ ప్రెషన్ కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో సవ్యసాచి, మిస్టర్ మజ్ఝ్ను సినిమాలు నిరాసపరిచినా.. ఇస్మార్ట్ శంకర్ తో ఓ హిట్ అందుకుంది నిధి. ఈ సినిమా తర్వాత నిధి అందాలకి ఇంకాస్త గిరాకీ పెరిగింది.

షూటింగ్ లేని రోజుల్లోనూ నిధి ఖాళీగా ఉండటం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్స్ కి పోజులిస్తోంది. ఐతే, తన తీరుకి భిన్నంగా చాలా పద్దతిగా, సాంప్రదాయ పద్దతిలో పోజులిచ్చింది నిధి. లైట్ గ్రే కలర్ ఛోళి లెహెంగాలో ఒక ఖజురహో పోజిచ్చింది. మ్యాచింగ్ చెవి కమ్మలు.. మ్యాచింగ్ గాజులు ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇప్పుడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం నిధి అగర్వాల్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ ఎంట్రీ ఇస్తున్న సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో జయంరవి కథానాయకుడిగా నటిస్తున్న భూమి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇందుల్లో ఈ గ్లామర్ పిల్ల.. పల్లటూరి పిల్లలా కనిపించనుంది.