రానా ఫోటో.. చూస్తే భయపడాల్సిందే.. !

యంగ్ హీరో రానా దగ్గుపాటి ఇటీవల అనారోగ్యానికి గురైనట్టు వార్తలొచ్చాయ్. అవి నిజమే అన్నట్టు ఆయన బక్కచిక్కి కనిపించారు. మరీ నీరసంగా ఉన్న రానా ఫోటో ఒకటి చూసి ఆయన అభిమానులు కంగారు పడ్డారు. కానీ, భయపడాల్సింది ఏమీ లేదు. రానా అమెరికాలో చికిత్స చేయించుకొన్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారని తర్వాత తేలింది.

ఈ విషయం పక్కనపెడితే.. తాజాగా ఓ కొత్త ఫోటోలు రానా ప్రేక్షకులని భయపెట్టాడు. రానా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆయన చాలా ఎత్తుగా కనిపించారు. తలపై కౌబాయ్‌ క్యాప్‌తో నల్ల కళ్లద్దాలు పెట్టుకోని చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చారు. సాధారణంగా జాతర్లలో సాహసాలు చేసేవారు కాళ్ల కింద పొడవాటి కర్రలు పెట్టుకోని బ్యాలన్స్‌గా నడుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు రానా అదే చేశారు.

మరి ఉన్నట్లుండి రానా ఈ సర్కస్‌ మ్యాన్‌ గెటప్‌లోకి ఎందుకు మారినట్లు.. ఇది సినిమా కోసమా? సరదా కోసం చేసిన పనా? అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. రానా  ‘విరాటపర్వం’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.