ఇంటెల్‌ డిజైన్ సెంటర్’ని ప్రారంభించిన కేటీఆర్

ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతుంది అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ రాయదుర్గంలో ఇంటెల్‌ డిజైన్ అండ్ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. ఎలక్ర్టానిక్స్ మానిఫ్యాక్చరింగ్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏప్రిల్‌లో టీ వర్క్స్‌ ఆవిష్కరిస్తాం” అన్నారు.

దేశంలో రెండో ఇంటల్ డిజైన్ సెంటర్ ఇది. బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది ఇంటెల్‌. దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇంటెల్ సెంటర్ప్రారంభోత్సవానికి ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజా తదితరులు  పాల్గొన్నారు.