మైండ్ బ్లాక్ అయిందా.. రాముల ?


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు మైండ్ బ్లాక్ అయ్యే రిప్లై ఇచ్చారని చెప్పుకొంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. తాజాగా ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’ వచ్చేసింది. నిజంగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది సాంగ్. డప్పు దరువులు, మహేష్ డైలాగ్స్, రొమాంటిక్ పదాలతో మాస్ ని మురిపించేలా ఉంది మైండ్ బ్లాక్ సాంగ్. ఈ నేపథ్యంలో మైండ్ బ్లాక్ సాంగ్ ని అల.. మాస్ సాంగ్ రాములో రాములతో పోల్చి చూస్తున్నారు. కొందరు ప్రిన్స్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిందా.. రాముల ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం అల.. వైకుంఠపురంలో. ఈ సినిమా నుంచి వచ్చిన మాస్ సాంగ్ ‘రాములో రాముల.. ‘ అటు మాస్ ఇటు క్లాస్ ని మురిపించింది. అత్యధిక వ్యూస్ సాధించి సరికొత్త రికార్డుని సృష్టించింది. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న రెండో సాంగ్ (సామజవరగమన తర్వాత) నిలిచింది. ఇప్పుడీ సాంగ్ ని మైండ్ బ్లాక్ తో పోల్చి చూస్తున్నారు. ఎందుకంటే.. అల.. సరిలేరు రెండు సంక్రాంతి సినిమాలే. ఒకరోజు గ్యాప్ తో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పోలీక. వాస్తవానికి రాములో రాముల, మైండ్ బ్లాక్ దేనికదే ప్రత్యేకమైనది. ఈ రెండింటి పోల్చి చూడలేమో.. !

ఈ రెండింటిలో ఏదీ బెస్ట్ అంటే మాత్రం.. వ్యూస్, రికార్డుల ప్రాతిపదికగా చెప్పాలేమో. దానికి ఇంకా టైం ఉంది. మైండ్ బ్లాక్ ఏ రేంజ్ లో రికార్డ్ సృష్టిస్తుంది అనేది చూడాలి. రాములో రాములో రేంజ్ లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధిస్తుందేమో చూడాలి.
సంక్రాంతి సినిమా ‘అల.. వైకుంఠపురంలో’