‘దబాంగ్ 3’ స్పెషల్ సాంగ్ చూశారా ?

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న చిత్రం ‘దబాంగ్ 3’. సోనాక్షి సిన్హా కథానాయిక. ఈ సినిమా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆదివారం ‘మున్నా బద్మాన్‌ హువా’ అంటూ సాగే ఓ స్పెషల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో నటి వరీనా హుస్సేన్‌సల్మాన్‌తో ఆడిపాడారు.

ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ‘హుద్‌ హుద్‌ దబాంగ్‌’ పాట విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు కాషాయ వస్త్రాలు ధరించి డ్యాన్స్‌ కనిపించారు. సల్మాన్ హిందూ వ్యతిరేకి.. ఆయన హిందువులని అవమానించారంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. దీనిపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.

ఇక దబాంగ్ సిరీస్ లో వస్తున్న మూడో పార్ట్ ఇది. దబాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా దబాంగ్ 2 యావరేజ్ గా నిలిచింది. దబాంగ్ సినిమానే హారీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ గా రిమేక్ చేసిన సంగతి తెలిసిందే.