అఖిల్ తో పూజా చిలిపిపని !

హీరోయిన్ పూజా హెగ్డేకు స్టార్ హీరో, యంగ్ హీరో అనే తేడానే లేదు. అందరితో రొమాన్స్ చేస్తోంది. అల్లు అర్జున్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది పూజా. ప్రస్తుతం ప్రభాస్ తో రొమాన్స్ చేస్తూనే యంగ్ హీరో అఖిల్ కి జంటగా నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అఖిల్ సినిమాలో పూజానే హీరోయిన్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. 

అంతకుముందే అఖిల్ తో పూజా చేసిన చిలిపి పనికి సంబంధించిన ఫోటో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో అఖిల్ ని పూజా చిన్న పిల్లాడి చేసి ఆడుకున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు అఖిల్ ఖాతాలో తొలి హిట్ పడలేదు. ఆయన నటించిన తొలి సినిమా అఖిల్ అట్టర్ ప్లాప్ అయింది. ఆ తర్వాత ఆయన చేసిన హలో, మిస్టర్ మజ్ఝ్ను చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ సినిమాపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకొన్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.