వరుణ్ తేజ్ ‘జానీ’ చేస్తున్నాడా ?

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ మాదిరిగానే వరుణ్ తేజ్ మెగా చట్రంలో ఇరుక్కుపోకుండా తనకంటూ ప్రత్యేకమైన స్టయిల్ ని ఏర్పర్చుకొన్నారు. ఈ క్రమంలో ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, ‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్స్ అందుకొన్నారు. పవన్ కి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్.. ‘గద్దలకొండ గణేశ్’తో వరుణ్ కి ఆ రేంజ్ హిట్ట్ అందించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథ దాదాపుగా పవర్ ‘జానీ’ సినిమాను పోలి ఉంటుందని సమాచారమ్. పవన్ మాంఛి ఫామ్ లో ఉన్న సమయంలో జానీ సినిమా చేశారు. కానీ, ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఐతే, ఆ సినిమాలో ఉండే ఎమోషనల్ కంటెంట్ బాగుంటుంది. ఇప్పుడు అలాంటి ఎమోషన్స్ తో వరుణ్ తేజ్ సినిమా తెరకెక్కుతోంది. కథ-కథనాలు ఇంకా బలంగా ఉంటాయని చెబుతున్నారు. మరీ.. జానీ కథతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడేమో చూడాలి.