ప్రధానిని సీఎం కేసీఆర్ కోరనున్న అంశాలివే.. !
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతోనూ కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలపై వారితో చర్చించే అవకాశముంది. ఐతే, దిశ ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానికి పలు సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఓ లేఖని సీఎం కేసీఆర్ ప్రధానికి అందించబోటున్నట్టు తెలుస్తోంది.
దిశ ఘటనలాంటి దోషులకి కఠిన శిక్షలు పడేందుకు వీలుగా చట్టాలని మార్చాలని సీఎం కేసీఆర్ ప్రధాని కోరనున్నారు. ఆర్టీసీ అంశంగాన్ని ప్రధాని వివరించనున్నారు. వీటితో పాటుగా క్రింది విషయాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
* హైదరాబాద్ లో ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల కేటాయింపు
* విభజన హామీల అమలు, తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల బదలాయింపు
* వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధి కింద రూ.451 కోట్ల బకాయిలు, జాతీయ ఆకృతి సంస్థ (ఎన్ఐడీ), ఐఐఎం, జాతీయ శాస్త్ర, విద్యా పరిశోధన సంస్థ ఏర్పాటు * భగీరథ, కాకతీయలకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధుల చెల్లింపు, మిషన్ కాకతీయ నిర్వహణకు ఏటా రూ.వెయ్యి కోట్ల చెల్లింపులు
* కాళేశ్వరానికి జాతీయ హోదా, సీతారామ ప్రాజెక్టుకు నిధులు, సింగరేణి బొగ్గు గనులను విద్యుత్ కేంద్రాల అవసరాలకు కేటాయించడం
* 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2,027 కోట్ల బకాయిలు, ఐటీఐఆర్ కు అనుమతి, జహీరాబాద్ నిమ్జ్ కు రూ.5,000 కోట్ల కేటాయింపు
* వరంగల్ మెగా జౌళి పార్కుకు కేంద్రం నిధులు, ఔషధ నగరికి సాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, జాతీయ రహదారుల పనుల మంజూరు వంటి అంశాలపై ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.