‘దిశ’ది గొప్ప మనసు

అతి దారుణం అత్యాచారానికి గురై అత్య చేయబడిన ‘దిశ’ది గొప్ప మనసు. ఆమెది సాయం చేసే గుణమని ఆమెకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు చెబుతున్నారు. సహాయ గుణం కలిగిన దిశ పాఠశాల ఇచ్చే మోస్ట్‌ హెల్పింగ్‌ స్టూడెంట్ పురస్కారానికి నామినేట్ అయిందని పాఠశాల డైరెక్టర్‌ భరద్వాజనాయుడు తెలిపారు. 

‘దిశ’ 8 నుంచి 10వ తరగతి వరకు వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని గ్రీన్‌వుడ్‌ పాఠశాలలో చదివింది. 2006లో ఎనిమిదో తరగతిలో చేరిన దిశ వసతి గృహంలో ఉండి చదువుకునేది. పదో తరగతిలో 536 మార్కులు సాధించింది. దిశ మంచి మనసు గుర్తు చేసుకొని ఆమె తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

 ఇక సోమవారం కుటుంబసభ్యులు, దిశ స్నేహితులతో కలిసి బీచుపల్లికి చేరుకున్న తండ్రి దిశకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు. దిశ అస్థికలను ఆమె తండ్రి జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.