ఉచిత ఇళ్లు.. ఆ ఇంటికి లోను సౌకర్యం కూడా !
సీఎం జగన్ తనదైన మార్క్ పాలనతో ఆకట్టుకొంటున్నాడు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అందజేసే ఇంటి పట్టా ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందవచ్చు. అంతేకాదు.. ఐదేళ్ల అనంతరం వాటిని విక్రయించుకునే సౌలభ్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
విక్రయించే సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి నిరభ్యంతర ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దీనికి అనుగుణంగా ఇంటి పట్టాను ఉచితంగా కాకుండా రాయితీపై ఇస్తున్నామని స్పష్టం చేసింది. లబ్ధిదారుడు ఇంటి స్థలానికి రూ.20 చెల్లించాలి. ఇందులో రూ.10 స్టాంపు పేపరు, మిగిలిన రూ.10 పట్టా ల్యామినేషన్ కు ఖర్చుపెట్టనున్నారు. ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందంటే.. అది రిజిస్ట్రేషన్ ప్లాటుతో సమానం అన్నమాట.