ప్రభాస్’తో మళ్లీ టచ్ లోకి కాజల్.. !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీటీ అనుష్కతో ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరు పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ప్రభాస్, అనుష్క ఇద్దరు ఖండించినా.. ఇప్పటికి ఆ పుకార్లకి పులిస్టాప్ పడటం లేదు. అనుష్క కంటే ముందు కాజల్ తో ప్రభాస్ క్లోజ్ గా ఉన్నట్టు వార్తలొచ్చాయ్. ప్రభాస్ అంటే కాజల్ కి పిచ్చ ప్రాణం. ఆయన్ని పెళ్లాడాలని కూడా ఆశపడిందనే ప్రచారం జరిగింది. వీరిద్దరు కలిసి మిస్టర్ ఫర్ ఫెక్ట్, డార్లింగ్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ తనని పట్టించుకోవడం లేదని, అసలు టచ్ లోకి రావడం లేదని కాజల్ సన్నిహితుల దగ్గర వాపోయినట్టు గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఐతే, ఇప్పుడు ప్రభాస్ కాజల్ కి టచ్ లోకి వచ్చినట్టు సమాచారమ్. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. 1970 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించబోతుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే కాజల్ మళ్లీ ప్రభాస్ తో టచ్ లోకి వచ్చింది. మళ్లీ రొమాన్స్ స్టార్ట్ అంటూ గాసిప్ రాయులు కథనాలు రాస్తున్నారు.