ఇలాంటి లవ్ స్టోరీ ట్విస్ట్ విని ఉండరేమో.. !
ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడం సహజమే. కొన్ని జంటలు పెద్దలని ఒప్పించి.. మరికొన్ని జంటలు పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకొంటాయి. మరికొన్ని ప్రేమకథలు విషాదాంతంగా మిగిలిపోతుంటాయ్. ఈ ప్రేమకథలో ట్విస్ట్ మాత్రం ఇదివరకు ఎప్పుడు విని, చూసి ఉండరు. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఐతే, వీరి పెళ్లికి ఆటంకాలు ఎదురయ్యాయి.
చివరకు పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. ఇంతవరకూ స్టోరీ రొటినే. ఐతే, ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే.. వాళ్లిద్దరూ అబ్బాయిలు. అవునూ.. ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. లింగ మార్పిడి చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు షరతు పెట్టాడు. దాంతో రెండో యువకుడు.. లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఐతే, ఆఖరి నిమిషంలో మొదటి యువకుడు హ్యాండిచ్చాడు. దాంతో ఈ యువకుల జంట పెళ్లి పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య, గుండ్లగాని సాయిల ప్రేమ పంచాయితీ ఇది. ఈ పంచాయితీకి పోలీసులు ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తారనేది ఆసక్తిగా మారింది.