జెర్సీలో తాప్సీ.. సూపర్ ! 


హీరోయిన్ తాప్సీ క్రికెట్ జెర్సీ వేసుకొంది. ఏకంగా టీమిండియా మహిళా జట్టుకు కెప్టెన్ అయింది. భారతదేశం గర్వించదగ్గ ఎన్నో విజయాలని అందించనుంది. వ్యక్తిగతంగా ఎన్నోరికార్డులు సృష్టించనుంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ? టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. “శభాష్‌ మితు పేరిట” టైటిల్ తో మిథాలీ బయోపిక్ తెరకెక్కనుంది.

మిథాలీ రాజ్ కోసం తాప్సీని ఎంపిక చేశారు. మిథాలీ రాజ్ పుట్టినరోజు కానుకగా నేడు మిథాలీరాజ్ గా తాప్సీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో జెర్సీ ధరించిన తాప్సీ అచ్చం మిథాలీలా చిరు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. “మహిళా క్రికెటర్‌గా మిథాలీ ప్రస్ధానాన్ని తాను స్క్రీన్‌పై ప్రెజెంట్‌ చేసే అవకాశం రావడం గర్వకారణమని, ‘శభాష్‌ మిథు’లో మిథాలీ తనను తాను సరైన రీతిలో చూసుకునేలా నటిస్తా”నని తాప్సీ ట్విట్ చేసింది.