3.5 లక్షల ఉద్యోగాల భర్తీకి టీ-సర్కార్ కసరత్తు !
నిరుద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న నాలుగున్నర యేళ్లలో 3.5లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్ రాయదుర్గంలో ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రానున్న నాలుగు సంవత్సరాలలో.. ఎలక్ట్రానిక్ పరిశ్రమద్వారా రాష్ట్రంలో 3.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామన్నారు. తెలంగాణకు మూడో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ని మంజూరుచేయాలని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, న్యాయశాఖల మంత్రి రవిశంకర్ప్రసాద్కు లేఖ రాశామని తెలిపారు.
దేశానికే ఆదర్శంగా నిలిచే సంక్షేమ కార్యక్రమాలని సీఎం కేసీఆర్ రూపొందించారు. మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుభీమ తదితర పథకాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. తెలంగాణ పథకాలని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయి. ఐతే, విద్యార్థులు, నిరుద్యోగుల్లో మాత్రం సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేక ఉన్న మాట వాస్తవం.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పాడన్నది నిరుద్యోగుల వాదన. అరె… దశల వారీగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నం. భర్తీ చేస్తున్నం అన్నది ప్రభుత్వం మాట. ఇటీవల ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల్లోనూ కాస్త అసంతృప్తి తగ్గింది. ఇదే అదనుగా కొత్త నోటిఫికేషన్స్ జారీ చేసి.. నిరుద్యోగులని ఖుషి చేయాలనే ప్లాన్ లో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారమ్.