రూలర్ సాంగ్ ‘అడుగ‌డుగో యాక్ష‌న్ హీరో.. ‘ వచ్చేసింది !

‘రూలర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలయ్య. కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. భూమిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 20న రూలర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా  ‘అడుగ‌డుగో యాక్ష‌న్ హీరో.. ‘సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటకి రామ‌జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సాయి చ‌ర‌ణ్ భాస్క‌రుని పాడారు. చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ పాటలో బాలయ్య స్టయిలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. పబ్ కెళ్లి అమ్మాయిలని టెప్ట్ చేస్తున్నాడు.

ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెరవనున్నాడు. ఒక పాత్రలో బిజినెస్ టైకూన్ లా కనిపిస్తుండగా మరొక పాత్రలో సీరియస్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు . ఈ  రెండు పాత్రలలో బాలయ్య విశ్వరూపం ఓ రేంజ్ లో ఉంటుందట.మొత్తంగా రూలర్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇక డిసెంబర్ 20న రూలర్ తో పాటు సాయి తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్ కి సంబంధించిన సినిమాలు. రూలర్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా తెరకెక్కగా, ప్రతిరోజూ పండగ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. దీంతో పెద్దగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.