దిశ డిమాండ్ : చట్టాల్లో మార్పులకి కేంద్రం కసరత్తు

దేశ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దిశ నిందితులని కఠినంగా శిక్షించాలి. తక్షణమే ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకో చట్టాలని మార్చాలని బయట, పార్లమెంట్ వేదికగా గొంతకలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దేశంలో మూక దాడులను నియంత్రించడమే లక్ష్యంగా చట్టాన్ని మార్చే యోచనలో ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘నేర శిక్షాస్మృతి (సీఆర్ పీసీ), భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లలో మార్పులు తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. సీఆర్పీసీ, ఐపీసీలో అవసరమైన మార్పులు చేసేలా కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీ సలహాలను అధ్యయనం చేసి చట్టంలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’ అని తెలిపారు.