‘దిశ’ కేసు.. ఫాస్ట్ ట్రాక్’కు గ్రీన్ సిగ్నల్ !
‘దిశ’ నిందితులని తక్షణమే ఉరితీయాలనే డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ వద్ద వెటర్నరీ డాక్టర్ ని నలుగురు క్రూరులు అతి దారుణంగా అత్యాచారం చేసి.. సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. దిశ నిందితులని ఉరితీయాలని సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలుడి మాండ్ చేస్తున్నారు.
దిశ హత్యాచారం కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేసు సత్వర విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ట్రాక్ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైన తర్వాత రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం దిశ నిందితులు హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఉన్నారు.