తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదు : కేటీఆర్

మంత్రి కేటీఆర్ కేంద్రం తీరుపై మండిపడ్దారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ రాజకీయ కారణాలతో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదన్నారు. చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాటలు ప్రాధాన్యతని సంతరించుకొన్నాయి. కేంద్రం సీఎం కేసీఆర్ ప్రతిపాదనలని పెడచెవిన పెట్టినట్టు కనిపిస్తుంది.

అభివృద్ధి కేవలం నాగపూర్‌కేనా ? అని కేటీఆర్‌ సూటిగా ప్ర శ్నించారు. నాగ్‌పూర్‌, గుజరాత్‌, చెన్నైలను మాత్రమే పట్టించుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విభజన సమస్యలపై ఢిలీ వెళ్లిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారు. హైదారాబాద్ లో రక్షణశాఖ భూముల విషయంలోనూ అంతే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది.