ఓరచూపులతో చంపేస్తోంది.. !


నిండైన అందాలు నిధి అగర్వాల్ సొంతం. ఆ అందాలతోనే సినిమాల్లో నెట్టుకొస్తుంది. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నిధి అగర్వాల్. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ఝ్ను’లో అఖిల్ కి జంటగా నటించింది. ఈ రెండు సినిమాలు నిధిని నిరాశపరిచాయి. ఐతే, ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం నిధి అందాలని సరిగ్గా వాడుకొన్నాడు దర్శకుడు పూరిజగన్నాథ్. 

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో నిధికి గిరాకీ పెరిగింది. ప్రస్తుతం గల్లా అశోక్ ఎంట్రీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ్ లో జయంరవి ‘భూమి’ సినిమాలో నటిస్తుంది. ఇందులో పల్లెటూరు పిల్లగా కనిపించనుంది. చీరకట్టులో పొలం గట్టున నిల్చొని ఉన్న నిధి ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ మధ్య నిధి పద్దతి మార్చినట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే నిధి.. ఈ మధ్య చీరకట్టులో ఎక్కువగా కనిపిస్తోంది. చీరలో అందాలని ఆరబోతుంది. అవి చూసిన జనాలు మోడ్రన్ డ్రెస్ లో కంటే చీరకట్టులోనే నిధి అందంగా ఉందని చెప్పుకొంటున్నారు. తాజాగా నిధి చీరకట్టులో ఉన్న ఫోటోలో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు చూసేయండీ.. !