జయలలితగా రమ్యకృష్ణ లుక్ చూశారా ?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా వరుస కడుతున్నాయి. జయలలితగా నిత్యామీనన్, కంగనా, జయసుధ లుక్స్ బయటికొచ్చాయి. వీటిలో జయలలితగా కంగనా సూట్ కాలేదనే విమర్శలొచ్చాయ్. జయగా నిత్యా ఒదిగిపోయిందని కామెంట్స్ వినిపించాయి. తాజాగా జయలలితగా రమ్యకృష్ణ లుక్ రిలీజైంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ ‘క్వీన్’గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇది సినిమా కాదు. వెబ్ సిరీస్. తాజాగా క్వీన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో రమ్యకృష్ణ వైట్ అండ్ వైట్ శారీలో 
 సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. రేపు క్వీన్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో ప్రసారం కానుంది. ఐతే, ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేటు ఎప్పుడు అన్నది మాత్రం ప్రకటించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రమ్యకృష్ణ రంగమార్తండ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆమె భర్త కృష్ణవంశీ దర్శకుడు. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో యాంకర్ అనసూయకి కీలక పాత్ర లభించినట్టు సమాచారమ్.