అలియా మెచ్చిన టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా ?
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన తన పాత్ర షూటింగ్ ని పూర్తి చేసింది. ఐతే, స్టైల్‌పరంగా ఓ టాలీవుడ్ స్టార్ ఈ బ్యూటీనే మెప్పించారు. అది ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కాకపోవడం విశేషం. మరీ.. ఇంకెవ్వరు ? అంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
అలియా తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఈ ఏడాది స్టైల్‌పరంగా మీకు బాగా నచ్చిన నటీనటులు ఎవరు? అని ఓ విలేకరి ఆమెను ప్రశ్నించగా.. ‘హీరోయిన్స్‌లో అయితే అనుష్క శర్మ.. తను నాకెప్పటికీ ఫెవరెట్. అలాగే విజయ్ దేవరకొండ. తన స్టైల్ అద్భుతంగా ఉంటుంది’ అని ఆలియా తెలిపారు. ఇప్పటికే విజయ్ దేవరకొండకి బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పడిపోయిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి అవకాశం వస్తే విజయ్ దేవరకొండ మారిపోతానంది.
అంతేకాదు.. విజయ్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అంది. అన్నట్టు.. వీరిద్దరి కాంబోలో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అలియా కూడా విజయ్ దేవరకొండ స్టయిల్ ని మెచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి.. విజయ్ బాలీవుడ్ లో సినిమా చేయడానికి.. అక్కడి ప్రేక్షకులని కూడా మెప్పించడానికి అని ఆయన అభిమానులు చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది.
#VijayDeverakonda style being praised 🥰
👉#Aliabhatt said she likes VD fashion and style
👉 #VarunDhawan said VD's good 🥰
👉Location : #FilmfareAwards2019
👉@shravyavarma – Thanks for being an amazing stylist@TheDeverakonda @aliaa08 @Varun_dvn pic.twitter.com/EY3hqeIJuR
— Gopi Shan (@gopi_awaits) December 3, 2019