దిశ కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ.. ఎప్పుడంటే ?
దిశ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందనపై కొందరు పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ఐతే, అవేవి పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ దిశ కేసు విచారణ త్వరితగతిన జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చొరవ తీసుకొన్నారు. దానికి హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేంది. దీంతో దిశ కేసుని వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు కానుంది.
ఇక త్వరలోనే సీఎం కేసీఆర్ దిశ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే దిశ కుటుంబ సభ్యులను ప్రగతి భవన్‌కు పిలిపించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా ఒకరిద్దరు అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారమ్. వాళ్లు ఇప్పటికే దిశ కుటుంబ సభ్యులకి కలిసి ప్రగతి భవన్ కి రావాల్సిందిగా కోరారు.
దిశ కుటుంబ సభ్యులు ప్రగతి భవన్‌కు వచ్చిన రోజు సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి వారితో భోజనం చేయనున్నారు.అంతేకాదు.. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించనున్నారు. అది రూ. 20 నుంచి 25 లక్షలు ఉండనుందని తెలుస్తోంది. దాంతో పాటు దిశ చెల్లెలు భవ్యకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నారు.