జగన్ కి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. సీఎం కుర్చీ దింపుతా.. !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి టూర్ తో ఏపీ రాజకీయాలని హీటెక్కిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన విషయాలని టచ్ చేస్తున్నారు. హిందుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్.. తాను ఎప్పుడూ బీజేపీకి దూరం కాలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం జగన్ పై ఎటాక్ కి దిగుతున్నారు. జగన్ 6నెలల పాలనని విమర్శిస్తూనే.. రాష్ట్రంలో మత మార్పిడిలు ప్రభుత్వం అండతోనే జరుగుతున్నట్టు విమర్శలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సీఎం జగన్ డిఫెన్స్ చేయక తప్పని పరిస్థితి. ఇక గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లెలోని మార్కెట్ యార్డును సందర్శించిన పవన్.. సీఎం జగన్ ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను రైతుల్ని కలుస్తానంటే నన్ను జగన్ ఆపాలని చూసారన్నారు. నన్ను ఆపాలని చూస్తే.. మీ కుర్చీ నుంచి కిందకు దింపుతామని హెచ్చరించారు. మత మార్పిడులు మీద సీఎంకు.. ఉండే దృష్టి.. రైతుల సమస్యల మీద లేదంటూ విమర్శించారు. పవన్ ధైర్యం వెనక బీజేపీయే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.