’90ఎంఎల్’ పబ్లిక్ టాక్ 

‘ఆర్ఎక్స్100′ హీరో కార్తీకేయ తాగుబోతుగా మారిన సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం ’90ఎంఎల్’. ఈ చిత్రానికి శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహించారు. కార్తికేయకి జంటగా నేహా సోలంకి నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అభ్యంతరాలు, అడ్డంకుల నడుమ ’90ఎంఎల్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. కార్తీకేయ ఎందుకు తాగుబోతుగా మారాడు ? అసలు 90ఎంఎల్ కథేంటీ ? విశేషాలని ఉదయం పూట ఆట చూస్తున్న ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.

కార్తీకేయ కటౌట్ ని చూస్తే చెప్పొచ్చు మాస్ హీరోగా ఫర్ ఫెక్ట్ గా సెట్టవుతాడని. ‘ఆర్ఎక్స్100’లో యువతి చేతిలో మోసపోయిన గాఢ ప్రేమికుడిగా ఆకట్టుకొన్నాడు. హిప్పీ సినిమాలో డిఫరెంట్ స్టయిల్ లో కనిపించాడు. గుణ369లో యాక్షన్ లో అదరగొట్టాడు. గ్యాంగ్ లీడర్ లో సినిమాలో తనలోని విలనీజాన్ని బయటపెట్టాడు. ఇక 90ఎంఎల్ లో తాగుబోతుగా కార్తీకేయ నటన ఆకట్టుకొనేలా ఉంది. సినిమా ప్రారంభంలోనే కార్తీకేయ ఎందుకు మందు బానిస అయ్యాడన్నది కామిక్ రూపంలో చూపించారు.

హీరోయిన్ నేహా సోలాంకి పరిచయం.. మొదటి చూపులోనే కార్తికేయ ప్రేమలో పడటం.. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోయింది. తాగుబోతు పాత్రకి కార్తీకేయ సరిగ్గా సరిపోయాడు. యాక్షన్, డ్యాన్సుల్లో అదరగొట్టేశాడు. కథ బాగుంది. కథనంపై ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేమో. మొత్తంగా.. 90ఎంఎల్ మాస్ ని, ముఖ్యగంగా మందుబాబులని ఆకట్టుకొనేలా ఉంది.